వీకెండ్ వచ్చిందంటే చాలు రాంబాబుకి పట్టలేని ఆనందం. అదేదో సినిమా కోసం తమిళంలో వైరముత్తు గారు చెప్పిందే తెలుగులో ఎ యమ్ రత్నం గారు తిప్పి చెప్పినట్టు వారం ఐదునాళ్ళు ఆఫీసు వాళ్ళు వీర తోముడు తోమి వదిలితే మిగిలిన రెండునాళ్ళు మాత్రం కేవలం నాకే అంకితం అన్నట్టు కనీసం వీధి గుమ్మం ముఖం కూడా చూడకుండా లివింగ్ రూమ్ కి మాత్రం పరిమితమై ఆ వారమంతా పాచిపోయిన తెలుగు TV సీరియళ్ళు, రియాలిటీ షో ఎపిసోళ్ళు అన్నీఅయిపోయి అమ్మయ్య ఈవారం ఇంటర్నెట్ బిల్ గిట్టుబాటయినట్టే అనుకుంటూ.. బోనస్ గా పడుకునే ముందు చిమటా మ్యూజిక్ సైట్ లో 1980s SPB హిట్స్ ప్లేలిస్ట్ కనీసం ఏకధాటిగా 4-5 గంటలపాటు మోగేట్టు సెట్ చేసి ఇక ఈ వారాంతానికి పక్కెక్కాడు.
పాటల్లో మాధుర్యమో లేక వీరతోముడు వల్ల వచ్చిన అలుపోగాని మొత్తానికి మత్తుగా నిద్రపట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మిలతో మొదలెట్టి సిల్క్ స్మిత, డిస్కోశాంతిల మీదుగా నిన్న మొన్నటి ముమైత్ ఖాన్, హంసనందిని వరకు ఎవ్వరినీ అవమానించకుండా ఒక్కొక్కరిని పేరు పేరునా కలవరిస్తూ నచ్చిన లోకాలమీదుగా అలా తేలికగా విహరిస్తుండగా ఇంతలో ఎవరో ఒకటికి రెండు సార్లు ‘Stupid Fellow.. Stupid Fellow..’ అని తిట్టినట్టనిపించింది. బాగా పరిచయమున్న గొంతులా ఉండడమో లేకా తిట్లు ఆపకపోవడమో మొత్తానికి ఎవరో తన్ని లేపినట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. గోడమీద గడియారం మాత్రం నీకప్పుడే తెల్లారిందేరా అన్నట్టు 2-3 మధ్యలో చిన్నముల్లు చూపించింది. ఒక నిమిషం తరువాత నిద్ర మత్తు దిగాక అర్థమైంది తిట్టింది మెగావోడని. మొన్నామధ్య మెగావోడు ఓ అభిమానిని తిట్టినప్పటినుంచి అదే యావ. గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది రాంబాబుకి. ఎందుకంటే వాడు పుట్టి బుద్ధెరిగి అభిమానించింది, ఆరాధించింది మెగావోడ్నే. అంతే ఆవేశంగా ఈ నాలుగు మాటలు రాసి ‘Facebook’లో పడేశాడు.

అభిమానం – అవమానకరం (మామూలుగా కాదు.. మెగా)
అభిమానం – ప్రమాదకరం (సాయి ధర్మ్ తేజ్ ఘటన)
అభిమానం – ప్రాణానికి హానికరం (బాద్ షా దుర్ఘటన)
అభిమానం – ఆత్మహత్యా సదృశం (ఉదయ్ కిరణ్ జీవితం)
ఎవరెన్ని చెప్పినా..
అభిమానం – ఒక అసంకల్పిత ప్రతీకార చర్య♣

No comments:
Post a Comment