ఒరేయ్ రాంబాబూ... మరీ పైత్యం కాకపోతే భోగిమంటలతో సెల్ఫీ ఏంటిరా నీ పాసుగాల. ఆ వెనుక అమ్మాయెవర్రా.. జుట్టు అంటుకుంటుందేమో జాగ్రత్త అని చెప్పు, తల ఆరబెట్టుకోవడానికి భోగిమంటల్లో సెల్ఫీ తీయించుకోవక్కర్లేదు. ఆ ముందు వరసలో ఆ గొబ్బెమ్మపాణి ఎవడ్రా.. ఎంతమాత్రం ఆర్టిఫీషియల్ ఆవు పేడ అయితే మాత్రం గొబ్బెమ్మలతో సెల్ఫీ ఏంటిరా.. మా ఖర్మ కాకపోతే. అయినా ఆ ఫొటో ఫేస్బుక్లో పెట్టేదాకా బతికున్నావ్ అదే సంతోషం.
'ఫేస్బుక్కు + సెల్ఫీ' ఒక డెడ్లీ కాంబినేషన్ అనే విషయం ఇవాళ మరోసారి ఋజువయింది. ఈ సృష్టిలో అణుబాంబు తరువాత మనిషి కనుక్కున్న అతిప్రమాదకరమైన విషయం ఈ సెల్ఫీనే.. అనిపిస్తుంది కొన్ని ఫొటోలని చూస్తుంటే.
సరిసర్లే.. ఆందరికి భోగి పండుగ శుభాకాంక్షలని చెప్పు ♣
No comments:
Post a Comment