మొన్నీమధ్య మా రాంబాబుగాడు ఒ(బా)మెరికా నుంచి ఫోన్ చేశాడండి. రాంబాబు’గాడు’ అని చాలా స్వతంత్రంగా సంబోధించానంటే వాడు తప్పకుండా నాకెక్కడో classmate అయ్యుంటాడని తొందరపడి guess కొట్టిన వాళ్ళంతా ఒకసారి రెండు కాళ్ళు కడుక్కురండి అసలు విషయం చెబుతా…
మా రాంబాబు నా classmate కాదండీ. మా వీధి చివర బంగాళా పెంకుటిల్లు అప్పారావు గారి పెద్దబ్బాయి. వయసులో మాకన్నా పెద్దోడైనా పాపం వాడి సమవయస్కులెవరూ మా వాడకట్టులో లేకపోవడంతో మాతోనే ఆటలు, పాటలు (పనిలో పనిగా తిట్లు, తన్నులు కూడా) కానించేసేవాడు. అంచేత వాడి మెదడు కూడా మాతోపాటే సమాంతరంగా వృద్ధి చెందుతూవచ్చింది. తెలిసో తెలియకో మా రాంబాబు చిన్నప్పటినించీ ప్రతిదానికీ ఒక పంచవర్ష ప్రణాళిక అనుసరించేవాడు. నా ఉద్దేశం.. 10th, Inter, Engg చివరాఖరికి అమీర్ పేట చేరటంలో కూడానన్నమాట. ఏమైతేనేం మనోడు Bay Area లో settle అవ్వాలన్న వాడి తాతమ్మకల మొన్ననే గోదావరి పుష్కరాలకి నెరవేర్చాడు. ఇంత ఉపోద్ఘాతం ఇచ్చాక మీ రాంబాబుకి పెళ్లయిందా? పిల్లలెంతమంది? అని అడక్కండి. అవన్నీ ప్రకృతిననుసరించి అలా జరిగిపోయాయన్నమాట.
ఇంతకీ అసలు విషయమేంటంటే, అందరిలాగా మా రాంబాబుగాడు కూడా Facebook లో account ఓపెన్ చేశాడండీ. ఎడా పెడా పోస్ట్లు, షేర్లు అలా 3 comments, 6 likes తో మొదలైన వాడి Facebook జీవితం ‘Rambabu liked his own post’ కి చేరింది. ఫోన్లో వాడిగోల కూడా అదే. ఈ మధ్యకాలంలో Facebook ఓపెన్ చేస్తే కడుపు తరుక్కుపోతోందిట. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్డట్టు వాడి బాధంతా ఫోన్లో ఎక్కిళ్ళు పెట్టి మరీ చెప్పుకున్నాడు. మనలో మనమాట మావాడికి చించుకోకపోయినా కడుపు మోకాళ్ళవరకు ఉంటుంది అదివేరే విషయమనుకోండి. ఇంతకీ వాడి సమస్యల్లా Facebook ఓపెన్ చేసినప్పుడల్లా ఎదురుగా వాడికి కనిపించే ఒకే ఒక ప్రశ్న ‘What’s on your mind?’ అని. వాడి argument ఏంటంటే ‘What’s on your mind need not always be what’s on your face(book)’ అని. ఈ సత్యం తెలియక గతంలో నాలుకపై band-aidలు వేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయట మావాడికి. ‘అమాయకత్వంలో అవకాశం’ లాగా మావాడికి ఒక మాంచి ఆలోచనకూడా వచ్చిందట. అదేంటంటే ‘ముఖపుస్తకం’ లాగా ‘అంతర్ముఖపుస్తకం’ (Soulbook లాంటిది) ఒకటి ఉంటే ఎలా ఉంటుంది అని. ఇదే తడవుగా యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ కాన్సెప్ట్ మీద patent గాని తీసుకున్నరేమో అని విచారించాడు కూడానంట. మొత్తానికి మావాడికి అమెరికా గాలి, నీళ్ళే కాదు పిజ్జాలు, బర్గర్లు కూడా బాగా పడ్డట్టున్నాయి. చూడాలి ముందు ముందు ఏమేం కబుర్లు వినిపిస్తాడో… ♣
No comments:
Post a Comment