Friday, April 06, 2018

వర్ణావృతం






మొన్నటి వసంతంలో పుట్టింటి వారు పెట్టిన పచ్చని వెచ్చని పచ్చిక చీర, నిన్నటి శ్రావణంలో వర్షానికి తడిసిందని,

ఇప్పుడు శిశిరం వచ్చి తనువంతా రంగుల ఆకులతో ఆఛ్ఛాదన నిస్తే… ధవళ వస్త్రధారిణీ.. మా ప్రియ ధరణీ..

నిన్నటి వర్షంలో నవ్వుల హరివిల్లుతో పువ్వులు పూయించి సప్తవర్ణాలు తనసొంతం అనుకుని,

కార్తీకంలో వెన్నెల మడుగుల సంబరం జరుపుకున్న అంబరానికి సైతం అసూయ కలిగించావు. 

మరీ మురిసిపోకు వచ్చే హిమపాతంతో నువ్వు తెల్లచీర కడితే,ఎగిరే గువ్వకు, నింగికి - నీకు తేడా శూన్యం అని (అశాశ్వ)తత్వం బోధపడుతుంది.