Thursday, May 05, 2016

సర్వజ్ఞానానాం లౌక్యం ప్రధానం



జ్ఞానోదయం 
"సర్వజ్ఞత" అనేది సైద్ధాంతికం (theoretical), అనంతం. అంటే లెక్కల్లో (infinity) 'లాంటిది కాదు', అదే. ఇది నాస్థి అనిచెప్పాలి. పదార్ధస్పృహ నశించినవారికి లభించే బ్రహ్మజ్ఞానానికిది కనీసార్హత.
"నిర్దిష్ట జ్ఞానం" ఏదేని ఒక విషయం గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తేనే లభిస్తుంది. ఉదాహరణకి వైద్యంలో దంతవైద్యం లాగానన్నమాట.
"అ-జ్ఞానం".. అదొకరకపు జ్ఞానం, చాలా ప్రాధమికం. ముఖ్యంగా పశుపక్ష్యాదుల్లో, పసి పిల్లల్లో పుష్కలంగా ఉంటుంది. కొందరిలో పెద్దైనా పోదు. ఇదే ప్రపంచాన్ని నడిపిస్తుంది. పదార్ధ జీవనవిధానానికి ఇది పట్టుకొమ్మ. ఇదే మిడి మిడి జ్ఞానంగా కొన్ని సందర్భాల్లో చలామణీ అవుతుంది.
సాధారణ జ్ఞానం (common sense) ఇది తప్పనిసరి. ఇది కొరవడితే కష్టాలే… ముఖ్యంగా ఎదుటివారికి. కొందరిలో ఇది సందర్భాన్నిబట్టి బహిర్గతమౌతుంది. 
లెక్కల్లో సున్నా(0) కి శున్యానికి(ø) ఉన్న తేడానే అజ్ఞానానికి జ్ఞానశూన్యానికి ఉంది. 
అజ్ఞాని కానివాడు జ్ఞాని కాలేడు ఎందుకంటే 'వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలౌతుంది' అన్నారుగా జ్ఞానాగ్రేసరులు.
విద్యుత్ ప్రవాహంలాగే జ్ఞాన ప్రవాహం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం జ్ఞాన ప్రసారం మాత్రమే జరుగుతుంటుంది, బాబాల దగ్గర.
ఎన్ని జ్ఞానాలున్నా "సర్వజ్ఞానానాం లౌక్యం ప్రధానం" అని నా అభిప్రాయం. విజయలక్ష్మి గుడికి 5 మెట్లయితే ఇది అదృశ్యమైన(invisible) 6వ మెట్టు. ఆధునిక ప్రపంచంలో ఇది వజ్రాయుధం, రామబాణం, కవచకుండలం లాంటి వాటికన్నా శక్తివంతమైనది.
అందుకే ప్రపంచంలోని జ్ఞాన సమూహాన్ని చక్కగా ఒక బెల్ కర్వ్ లో ఇలా కుదించవచ్చునని... దించా.
ఇవికాక మీకు తెలిసిన జ్ఞానాలేవైనా ఉంటే క్రింద కామెంటండి :-)

4 comments:

  1. మీ జ్ఞానం గ్రాఫు బాగుంది. లోకంలో అజ్ఞానులే ఎక్కువున్నారని చెబుతోంది. మరోజ్ఞానం పరలోకానికి చెందింది అది మీ లాంటి చిన్నవాళ్ళు ఇప్పుడే వద్దులే అనుకుంటారు అవునా----

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. అంతేనేమో.. ఏ వయసులో రావలసిన జ్ఞానం ఆ వయసులో వస్తేనే సమతౌల్యం.
      ఆ పరలోక పరిజ్ఞానం మీరు ప్రసారం చేస్తానంటే అందుకోటానికి అంజలి సిద్ధం.

      Delete
    2. ఒక అజ్ఞానిగా నాకు 'అ-జ్ఞానం' గురించి మహ బాగా అర్ధం అయ్యిందండీ.

      ఇంతకీ విజ్ఞానం ఏ కోవలో చెందుతుంది?

      Delete
    3. మీరింకా అ-జ్ఞానం దగ్గరే ఉన్నారా? ఆ-జ్ఞానం ఇంకా అలవడలేదా అదేనండి విత్-జ్ఞానం విజ్ఞానం.. నం.. నం. అయినా వసంత కోకిలకి జ్ఞానంతో పనేంటండి.. ఈ జ్ఞానాజ్ఞాన కష్టాలు మానవులకు మాత్రమే. మీ కా-మింటు బావుంది.

      Delete