మూడేళ్ళ క్రితం తలలో కనిపించావ్.. మా ఇంటి యజమానిని పెట్టించి నీ పీక తెగ కోయించా. మూడు నెలల క్రితం గడ్డంలో కనిపించావ్.. మంటలేస్తున్నా రోజుమార్చి రోజు షేవింగ్ చేస్తూ నీ ఉనికి లేకుండా చేస్తున్నా. మూడు వారాల క్రితం మీసంలో.. మూడు రోజుల క్రితం నాసికా కుహురంలో. కానీ..కానీ.. మూడు నిమిషాల క్రితం కను బొమలు.. చివరికి రెప్పలలో కూడా నిన్ను చూశాక ఇప్పుడర్థమయింది 'ఇందు గలదందు లేదని సందేహము వలదు శిరస్సంతా ఎందెందు వెదకిన అందందే కలదు'. సర్వాంతర్యామీ.. ఈ లైను నీకు పూర్తిగా నప్పుతుంది.
No comments:
Post a Comment