Friday, April 06, 2018

వర్ణావృతం






మొన్నటి వసంతంలో పుట్టింటి వారు పెట్టిన పచ్చని వెచ్చని పచ్చిక చీర, నిన్నటి శ్రావణంలో వర్షానికి తడిసిందని,

ఇప్పుడు శిశిరం వచ్చి తనువంతా రంగుల ఆకులతో ఆఛ్ఛాదన నిస్తే… ధవళ వస్త్రధారిణీ.. మా ప్రియ ధరణీ..

నిన్నటి వర్షంలో నవ్వుల హరివిల్లుతో పువ్వులు పూయించి సప్తవర్ణాలు తనసొంతం అనుకుని,

కార్తీకంలో వెన్నెల మడుగుల సంబరం జరుపుకున్న అంబరానికి సైతం అసూయ కలిగించావు. 

మరీ మురిసిపోకు వచ్చే హిమపాతంతో నువ్వు తెల్లచీర కడితే,ఎగిరే గువ్వకు, నింగికి - నీకు తేడా శూన్యం అని (అశాశ్వ)తత్వం బోధపడుతుంది.



8 comments:

  1. Replies
    1. Thank you. That was from last fall in Norway.

      Delete
  2. ఒక్క ఫొటోయే ఏమిటి మీ బ్లాగే చాలా బాగుంది. ఇప్పటివరకు నేను చూడలేదేమిటా అనిపించింది. వ్రాయడంలో ఇంత చెయ్యి తిరిగిన మీరు మరీ ఏడాదికో టపా మాత్రమే పోస్ట్ చెయ్యడమే బాగాలేదు. Anyway good job.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం 🙏. భవ భవ సాగరాలు ఈదేపనిలోబడి తలమునకలేస్తూ.. లేచినప్పుడల్లా అలా ఒక టపా.

      Delete
  3. నార్వే లో ఉంటున్నారా? మరి fjord ల గురించి కూడా వ్రాస్తే అనందిస్తాం కదా (ఫొటోలతో సహా).

    ReplyDelete
    Replies
    1. అవునండీ. 'Fjords' గురించి.. మానవప్రయత్నం చేస్తాను (ఫొటోలతో సహా 😜).

      Delete



  4. నార్వేలో బసయా! టపా అదురహో! నచ్చింది‌‌ సుమ్మీ భళీ
    ఫర్వాలేదయ మీకు వీలు గలుగన్ ఫ్యార్డ్లన్ సమీక్షించుడీ!
    హర్వుంబెల్ల సచిత్రరూపకముగా హత్తించు రీతిన్నిడన్
    పర్వంబౌనయ రావుగారు పఠియింపన్మాకు క్రొంగొత్తగన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం. తప్పకుండా.

      Delete