Tuesday, January 31, 2017

నస - మానసమనలో మనమాట:
  • నస, (అను)మానస  ఇద్దురు ఇరుగుపొరుగు ఫ్లాట్స్ లో ఉండే ఇద్దురు పెళ్ళైన ఇల్లాళ్లు. (ఎవరింటికి వాళ్ళు మీరు కంగారుపడకండి)
  • ఇరుగుపొరుగు అవడం వల్ల వాళ్ళిద్దరిమధ్య అతి సహజంగా ఉండవలిసిన అసూయ, ద్వేషం, అనుమానంతోబాటు Bonus గా కొంచెం స్నేహంకూడా ఉంది.
  • ఆవిడ ఈవిడ్ని ‘ఒదిన’ అంటుంది, తిరిగి ఈవిడ ఆవిడ్ని ‘ఒదినా’ అనే అంటుంది. ఇద్దరికీ ఒకరి వయసుమీద ఒకరికి ఒక అభిప్రాయమే కానీ కనీసం అంచనా కూడా లేకపోవడమే దీనికి కారణం.
  • మార్నింగ్ రష్-అవర్ అయిపోయాక వాళ్లిదరు ఎవరో ఒకరింటిలో చేరి లోకకల్యాణం గురించి సుదీర్ఘ చర్చల్లో మునిగిపోవటం దినచర్య, ఆనవాయితీ.
  • ఆలా చేసిన సంభాషణల్లో ఒకటి మచ్చుకి..


నస: ఏవిఁటీ..? నీ గోడమీద ‘feeling sleepy’ అని రాసుకున్నావ్? అన్నయ్యగారు కూడా ఈ రోజు ఆఫీసుకి కాస్త లేటయినట్టున్నారు.. రాత్రి థియేటర్ లో సెకండ్ షోనా? లేక ఇంట్లోనే లేట్ నైట్ షోనా?


మానస: you mean Facebook wall మీదా? ఊరుకో ఒదినా.. నువ్వు మరీనూ.
అన్నట్టు మీవారు ఈ మధ్య లంచ్ బాక్సు వదిలిపెట్టకుండా తినేస్తున్నారట. ఆఫీసులో కూడా మా ఆవిడ వంట అద్భుతం అమోఘం అని పొగిడేస్తున్నారట. ఏంటి విశేషం నీ వంటలో అకస్మాతుగా? ఆ చిట్కా ఏదో మాకూ చెప్పి పుణ్యం కట్టుకోవచ్చుగా?


నస: విశేషమేంటంటే.. నేను చేసిన ప్రతి కూర పక్కింటి మానస పంపించింది అని చెప్పి వడ్డిస్తున్నా. అంతే కొంచం కూడా వదలట్లేదు. ఎలాగైనా మగవాళ్ళకి పక్కింటి పుల్లకూరలు రుచి కదా. ఆ చిట్కా వాడా. పనిచేస్తుంది ప్రస్తుతానికి.


మానస: ఈ టెక్నీకేదో బావుంది నేనూ ట్రై చేస్తా.


నస: అవును మీ అత్తగారికి ఉగాదికి 50 వేలు పెట్టి చీర కొన్నావట ఏంటీ విషయం? ఇంతకీ ఇచ్చావా లేదా?


మానస: ఇంకా ఇవ్వలా. మంచి సందర్భం కోసం wait చేస్తున్నా. విషయమేంటంటే మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మా అత్తగారికి గుండెల్లో నొప్పొస్తే డాక్టరు ‘ఏదైనా షాకింగ్ న్యూస్ ఆవిడ చెవిన పడకండా చూసుకోండి, పడితే ఆవిడ ప్రాణానికే ప్రమాదం’ అన్నాడు. ఆవిడ గుండెలో నొప్పి నిజమో? డాక్టరు వైద్యం నిజమో? ఈ దెబ్బతో తేలిపోవడమో లేదా ఆవిడ పోవడమో జరగాలి.


నస: మొత్తానికి చాలా costly ప్రయోగమే


నస: మొన్నీమధ్య మా అత్తగారికి కూడా గుండెనొప్పొచ్చి డాక్టరుకి ఫోన్ చేస్తే 2 వేలు అడ్వాన్సు తీసుకుని తరువాతి నెలకి appointment ఇచ్చాడు.


మానస: అదేంటండీ.. ఈలోపు ఆవిడకేదైనా ఐతే?


నస: నేను అంత తేలిగ్గా వదిలేస్తానా? అడ్వాన్సు తిరిగిచ్చేస్తానన్నాడులే.


మానస: అన్నట్టు ఈ విషయం తెలుసా.. 302 లో సావిత్రి గారిది సహజమరణం కాదట.. వాళ్లాయనే చంపేశాట్ట.


నస: ఆయన మాత్రం ఏం చేస్తాడు.. అస్తమానం ‘నిండు పసుపు కుంకుమలతో పండు ముత్తైదువుగా పోవాలని’ దేవుడ్ని అదేపనిగా ప్రార్ధించేదట. పతియే ప్రత్యక్ష దైవంకదా.. చూసి చూసి ఆ దేవుడు చేయవలసిన పని ఈ దేవుడే కానించేసేసుంటాడు.


మానస: అవునూ.. మీ ఇంట్లో ఎవరికెక్కువ పవరుంది? నీకా, మీ అత్తగారికా?


నస: మా అత్తగారికే. ఇది నేను చెబుతున్న విషయం కాదు. మొన్న కళ్ల డాక్టరు దగ్గరికెళ్ళినప్పుడు వాడు కూడా అదే చెప్పాడు.


మానస: గత వారం రోజులనుంచి ఆ ఎదురింటి బ్యాచిలర్ నిన్నే చూస్తున్నాడు. గమనించావా?


నస: లేదే.. అయినా నీకెలా తెలుసు వాడు నన్నే చూస్తున్నాడని?


మానస: పక్కింటి Y. శా Lee చూసి చెప్పిందిలే. ఎందుకంటే 6 నెలలుగా వాడ్నే చూస్తుందిట. అదే ‘గమనిస్తుందిట’.


నస: పోయిన నెలలో రవ్వల గాజులు కొన్నావట.. ఈ నెలలో డైమండ్ నెక్లెస్ కోన్నావట. ఎంతయిందేమివిటి?


మానస: రవ్వల గాజుల సెట్ ఒక లక్ష. డైమండ్ నెక్లెసేమో 5 లక్షలు. ఏ నువ్వుకూడా మీవారినడిగి కొనిపించుకుంటావా?


నస: అదేం లేదు. ఇలాంటి దుబారా ఖర్చులేవీ లేకుండా ఎంత ఆదా చేశానో మావారికి చెబుతామని.


మానస: ఒక నెల రోజులనుంచి బాగా బద్ధకంగా ఉంటోందండీ.


నస: ఈ సమస్యకి నాకు తెలిసి ఒక స్పెషలిస్టు డాక్టరున్నాడు.


మానస: కొంచెం ఇంటికొచ్చి చూస్తాడేమో కనుక్కోరూ.. చాలా ఇబ్బందిగా ఉంది.


నస: మీవాడెందుకూ అస్తమానం క్రికెట్ అని తిరుగుతుంటాడు. ఫుట్ బాల్ లాంటి వేరే ఆటలేమైనా ఆడొచ్చూగదా.


మానస: వాడు చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగాడు. ఆవిడేమో వాడికి ఏవస్తువునైనా కాలితో తన్నకూడదని చెప్పిందట.


నస: మొన్న మా అత్తగారు భలే ఝలక్ ఇచ్చింది తెలుసా?


మానస: ఏం జరిగిందేవిఁటీ?


నస: ‘నా తదనంతరం నా కాసులపేరు నీకేనమ్మాయ్’ అంది. కదాఅని ఉదయాన్నే జీడిపప్పు ఉప్మా దగ్గర్నుంచి రాత్రికి చికెన్ బిర్యాని వరకు అన్నీ వండిపెట్టా. రాత్రికి మావారొచ్చాక ‘కోడలు పిల్లకి కాసులపేరు ఇస్తానని మాటిచ్చా’ నాకు ఇప్పుడు ఒకటి కొంటావా? ఛస్తావా? అని కూర్చుంది. ఇప్పుడు నాకివ్వకపోయినా పరవాలేదత్తయ్యా అన్నా వినిపించుకోవట్లా.


మానస: మొన్నామధ్య డిన్నర్ కి బయటకెళ్లాం హోటల్ పేరు వెరైటీగా ‘Cuisine కొత్తల్లుడు


నస: ఏవిటట అక్కడ వెరైటీ?


మానస: అక్కడి ఫుడ్ మెనూ.. వంటల రుచులు డైలీ కొత్తల్లుడికి చేసినట్టు శుచిగా రుచిగా ఉంటాయని సింబాలిక్ గా అలా పెట్టారట.


నస: మరి అలానే ఉన్నాయా?

మానస: నాకైతే ‘Cuisine ఇల్లరికపల్లుడు’ అని పెడితే సరిపోయేది అనిపించింది. ఫుడ్డు బాలేదు, సర్వీసు అంతకన్నా బాలేదు.


No comments:

Post a Comment